Tuesday, January 21, 2025

కేసీఆర్ కుటుంబం చేతిలో దగాపడ్డ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: 9 ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ దగా పడిందని ఎఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశాబ్ది దగా పేరుతో ఆ పార్టీ నాయకులు చౌటుప్పల్‌లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని పూర్తిగా అవినీతి పాలన సాగిస్తుందని ఆరోపించారు. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News