Wednesday, January 22, 2025

విత్తనోత్పత్తులతో తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదారాబాద్: అధిక దిగుబడులనిచ్చే మేలు రకం విత్తనోత్పత్తులతో తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతీ లభిస్తోందని విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డా.కేశవులు వెల్లడించారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ, విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ, ఇండో-జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టు సంయుక్తంగా రాజేంద్ర నగర్‌లో నిర్వహించిన సదస్సులో డా.కేశవులు మాట్లాడుతూ తెలంగాణలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి విత్తన సదస్సులు జరగటం ఇది రెండవ సారి అన్నారు. తెలంగాణలోని విత్తనోత్పత్తిదారులకు , ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ శిక్షణను ఇచ్చి తెలంగాణ విత్తన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రభుత్వ , ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News