Thursday, January 23, 2025

మేమూ నష్టపోతున్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆస్తులు, ఆ ర్థికపరమైన నష్టాలే కాకుండా నదీ జలాలను కూడా భారీగా నష్టపోవాల్సి వ స్తోందని అధికార ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 అమలులోకి వచ్చి తొమ్మిది (మరో రెండు నెలల్లో) సంవత్సరాల సమయం కా వస్తోందని, ఇప్పటికీ కేంద్రం ఏ ఒక్క విభజన సమస్యనూ పరిష్కరించలేదని తెలంగాణ ఉన్నతాధికారులు అంటున్నారు. విభజన సమస్యలను పరిష్కరించకపోవడం మూలంగా ఒక్క ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదని తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని విధాలుగా నష్టపోతోందనే విషయాలను సు ప్రీంకోర్టు దృష్టికి తీసుకెళతామని కొందరు సీనియర్ అధికారులు అంటున్నారు.

షెడ్యూల్ 9, షె డ్యూలు 10లోని సంస్థల పంపకాలు చేయకపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదని, తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టమే జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తె లంగాణ రాష్ట్రంలో యుద్ధ్దప్రాతిపదికన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టులకు నదీ జలాల కేటాయింపు లు కూడా చేయకుండా కేంద్ర ప్రభు త్వం అంతులేని నిర్లక్షం వహిస్తోంద ని, అంతేగాక కోర్టు కేసులు, ట్రిబ్యునల్‌లో కేసులు, ప్రాజెక్టు ల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపి ఆర్)లపై క్లారిఫికేషన్స్ (వివరణలు) పేరు తో క్లియరెన్స్‌లు ఇవ్వకుండా కాలయాపనలు చేస్తూ కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించడం లేదని, ఇదే కోవలో పాలమూరు-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు క్లియరెన్స్ లు కూడా ఆగిపోయాయని, దాంతో ప్రాజెక్టు ని ర్మాణాలు ఎక్కడివక్కడనే ఆగిపోయాయని ఆ అధికారులు వివరించారు.

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాలు ఎంతో ముఖ్యమైనవని, ఈ నదిలోని నీటిలో 50 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కా వాలని, లేకుంటే హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి కొరత సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 810 టిఎంసిల నీటికేటాయింపులు జరిగాయని, అందులో సగ భాగం ఇస్తే 405 టిఎం సిలవుతాయని, కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదిలో కనీసం 550 టిఎంసిల నీటి అవసరాలున్నాయని ఆ అధికారులు వివరించారు. ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలకు హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సింది కూడా కృష్ణానదీ జలాలతోనేనని జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగాయని, ఆ విధంగా లెక్కలు వేస్తే తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలు ఎవ్వరికైనా ఇట్టే అర్ధమవుతాయని అంటున్నారు.

అంతేగాక చిన్నచిన్న విభజన సమస్యలను కూడా కేంద్రం పరిష్కరించడం లేదని, దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించుకోవడానికంటే వివాదాలు కొనసాగడానికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా ఉందని ఆ అధికారులు పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకంగా 511 టిఎంసిల నీటిని వాడుకుంటోందని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కేవలం 299 టి.ఎం.సి.లకే పరిమితం కావాల్సి వస్తోందని, అందుకే ఏపీ ప్రభుత్వం నదీ జలాల పంపకాల విషయంలో కలిసి రావడంలేదని, ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ అధికారులు వివరించారు. దీనికితోడు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రప్రభుత్వ ఆర్ధిక శాఖ అవగాహనా రాహిత్యం వల్ల తెలంగాణకు చెందాల్సిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేశారని, కనీసం ఆ నిధులనైనా తెలంగాణాకు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ముఖ్యంగా 9వ షెడ్యూలులోని 91 సంస్థల విభజన విషయంలో డాక్టర్ షీలాభిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను కూడా అమలు చేయించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని, వివాదాల పరిష్కారానికి నియమించిన సబ్-కమిటీ మూడు దశల్లో ఈ సంస్థలను విభజించాలని సిఫారసు చేసిందని, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలున్నాయని అధికారులు తెలిపారు. అంతేగాక డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డి.ఐ.ఎల్.ఎల్-దిల్), ఏపీ డైరీ డవలప్‌మెంట్ కార్పోరేషన్‌ల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ఇచ్చిన విన్నపాలు ఏమయ్యాయో అంతుబట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వివాదం కూడా పరిష్కారానికి నోయుకోలేదని వివరించారు.

10వ షెడ్యూలులోని 142 సంస్థల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదని, తెలుగు అకాడము విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించేవిగా ఉన్నాయని అభ్యంతరాలు తెలిపినప్పటికీ కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్), ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏ.పీ.హెచ్.ఎం.ఇ.ఎల్)లు పూర్తిగా తెలంగాణకు చెందిన ఆస్తులని, ఇందులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఏ.పీ.హెచ్.ఎం.ఇ.ఎల్ సంస్థ కేవలం సింగరేణికి అనుబంధ సంస్థ మాత్రమేనని, అందుకే సింగరేణిలో వాటాలు కోరుతున్న ఏపీ ప్రయత్నాలను తాము మొదట్నుంచీ అడ్డుకొంటూనే ఉన్నామని, కానీ కేంద్రం తన నిర్ణయాన్ని ఇప్పటికీ తెలపడంలేదని తెలిపారు.

సివిల్ సప్లయీస్ కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిన నిధుల్లో వివాదాస్పదమైన 354 కోట్ల రూపాయల నిధుల విషయంలో సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర వాటాను కూడా కేంద్రం తేల్చలేకపోయిందని, ఇది చాలా చిన్న సమస్యని అయినప్పటికీ కేంద్ర హోంశాఖాధికారులు తగిన నిర్ణయం తీసుకోవడానికి ఆసక్తిని చూపడంలేదని వివరించారు. ఇక విభజన చట్టంలో లేనటువంటి 12 ఇన్‌స్టిట్యూట్‌లను విభజించడానికి ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌లపైన కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాలు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంగీకారం తెలిపినప్పటికీ ఈ సమస్యపై కేంద్రం ఇంకనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయించాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరామని, కానీ ఇప్పటి వరకూ ఆ నిధుల్లో ఒక్క రూపాయిని కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని, వీటన్నింటిపై తెలంగాణకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో అంతుబట్టడంలేదని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా విభజన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుగా ఉన్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News