కుభీర్ : దేశంలో ఆలయాలను నిర్మించడంలో తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలో సుమారు ఒక కోటి 32 లక్షలతో పలు అభివృద్ధ్ది పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. జుమ్డా గ్రామంలో 12.50 లక్షలతో జగదంబా దేవి ఆలయ నిర్మాణానికి, పల్సి గ్రామంలో రూ.40 లక్షలతో కళ్యాణ మండపానికి, పల్సి తండాలో రూ.50 లక్షలతో జగదాంబ దేవి ఆలయ నిర్మాణానికి , గొడిసెరా గ్రామంలో రూ. 30 లక్షలతో మహదేవ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం మార్కెట్ కార్యాలయ ఆవరణలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల నిర్మాణానికి అబివృద్ధ్దికి చిత్తశుద్దితో వ్యవహరించి ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలయాల పునరుద్దరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోబిఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, వైస్ ఎంపిపి మోహినుద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, పిఎసిఎస్ చైర్మెన్ రేకుల గంగాచరణ్, మాజీ జడ్పిటిసి చౌహన్ శంకర్, మాజీ పిఎసిఎస్ చైర్మెన్ దొంతుల రాములు, కోఆప్షన్ సభ్యులు దత్తహరి పటేల్, జుమ్డా సర్పంచ్ అర్చన, సురేష్, పల్సి సర్పంచ్ కవిత రాజేష్, పల్సి తండా సర్పంచ్ తిత్రాబాయి, గొడిసెరా సర్పంచ్ మనీషా శ్రావణ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు బాబు, కళ్యాణ్, నాగలింగం, సిద్దంవార్ వివేకానంద, రవూఫ్, తదితరులుపాల్గొన్నారు.