Monday, December 23, 2024

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

వెల్దండ:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాల నందిస్తూ సిఎం కెసిఆర్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడని ,ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానం పొందిందని బిఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వచ్చే ఎన్నికలలో మా పార్టీకి ఎదురే లేదని మాదే అధికార మని కల్వకుర్తి ఎంఎల్‌ఏ జైపాల్ యాదవ్ అన్నా రు.

మండల పరిదిలోని గుండాల,ఉబ్బలగట్టు తాండా,నగారగడ్డ తాండా గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజనదినోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ఎంఎల్‌ఏ జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు.గ్రామానికి చేరుకున్న వారిని ఆయా గ్రామాల సర్పంచ్‌లు మైసయ్య,బుజ్జిసాజ్యానాయక్,దశరథ్ నాయక్,యదమ్మలు ఘనంగా స్వాగతం పలికి శాలువాలు,పూలమాలలతో సన్మానించారు.

అనంతరం చెదురుపల్లి గ్రామ పంచాయతి పరిధిలోని బొల్లిగుట్ట తాండా లో బిఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి సిసి రోడ్డు పనులకు భూమి పూజా చేశారు.ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని ,ప్రజలు అడిగిన పథకాలతో పాటూ అడగని ఎన్నో పథకాలను అందిస్తూ స్రీఎం కేసిఆర్ పజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడని కల్వకుర్తి నియోజకవర్గ అభివృధ్దికి అహర్నిషలు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, ఎంపిపి విజయ జైపాల్ నాయక్,జడ్పిటీసి ద్యాప విజితారెడ్డి,మండల వైస్ ఎంపిపి శాంతి గోపాల్ నాయక్,మాజీ వైస్ ఎంపిపి వెంకటయ్యగౌడ్,సర్పంచులు పత్యానాయక్,అంజ్యానాయక్,మండల బీఆర్‌ఎస్ నాయకులు బాస్కరావు,జైపాల్ నాయక్,గోపాల్ నాయక్,సాజ్యానాయక్,అంజయ్య,శ్రీనూనాయక్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News