Monday, December 23, 2024

తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్‌వన్

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల రూరల్: 24 గంటల ఉచిత విద్యుత్‌ను రైతులందరికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెలంగాణ విద్యుత్ విజయోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ….తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోత లు దుస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు విరజిమ్మే రాష్ట్రంగా మారి ందన్నారు. తెలంగాణ రైతులు విద్యుత్ కోసం దశాబ్దాల తరబడి అనేక బాధ లు పడ్డారని, భూగర్భంలో నీళ్లున్నా తోడుకోవడానికి కరెంట్ లేక గోసపడ్డారని, చేతికొచ్చిన పంట ఎండిపోతున్నా నిస్సహాయులుగా మిగిలిపోయారన్నారు. రైతులందరికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వప్నామన్నారు.

తెలంగాణ రైతులు బాగుపడితేనే సాధించుకున్న స్వరాష్ట్రానికి సా ర్థకత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మిరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఎస్‌ఈ వెంకన్న, డీఈ శివశంకర్, మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, ఏడీ స్వామి, సాయినాథ్, ఏఈ నరేందర్, ప్రదీప్, దుర్గాప్రసాద్, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News