Friday, November 22, 2024

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

రేగొండ: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అన్ని శాఖల అధికారులు ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మనం సాధించుకున్న పురోగతిని ప్రజలందరితో కలిసి నెమరు వేసుకోవడం కొరకు నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రతి రోజు ఒక కార్యక్రమం చేసుకునే విధంగా 20 రోజుల పాటు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు పారదర్శకత, జవాబుదారితనంతో కూడిన పరిపాలన అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 35 డివిజన్‌లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 కొత్త మున్సిపాలిటీలు, 4914 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలోనే నూతనంగా ఏర్పాటయిన తర్వాత , పలిమెల మండలాలతో పాటు మరో రెండు రోజుల్లో గోరికొత్తపల్లి మండలం ఏర్పాటుచేసుకోబోతున్నామన్నారు. అదే విధంగా 74 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పా టు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ ప్రజలందరికి సులభతరంగా అందుబాటులో ఉండే విధంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భూమి లావాదేవిల ప్రక్రియను సులభతరం చేయడానికి రెవెన్యూశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు.

భవన నిర్మాణ అనుమతుల కోసం టిఎస్ బిపాస్ ద్వారా త్వరితగతిన కావాల్సిన అనుమతులు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సురేందర్ గౌడ్, తహసీల్దారు షర్పోద్దీన్, ఆర్‌ఐ జూపాక నరేష్‌కుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్‌స్పెక్టర్ మహమ్మద్ సందాని, స్పెషల్ ఆఫీసర్ సామ్యూల్, గ్రామ సర్పంచ్ నిషిధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News