Saturday, December 28, 2024

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

కాల్వశ్రీరాంపూర్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షమ పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు.

పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది పనులను ప్రతి గడపకు తెలియజేయాలన్నారు.

ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండాయేనని, రాష్టంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతి కార్యకర్తను గుండెలో పెట్టుకుని చూసుకుంటామని, గులాబీ జెండా అందరికి అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మండల అధ్యక్షుడు, రైతు సమతి మండల కోఆర్డినేటర్, ఫ్యాక్స్ చైర్మన్‌లు, పార్టీ కన్వీనర్‌లు, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News