Sunday, December 22, 2024

తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. నెంబర్ వన్ తో పాటు తెలంగాణ కు వరుసగా 04 ఉత్తమ అవార్డులు దక్కాయి. ఎనిమిది కేటగిరీల్లో తెలంగాణకు ఉత్తమ అవార్డులు లభించాయి. విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులందుకున్న సర్పంచులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముఖరా-కె గ్రామానికి కేంద్ర పురస్కారం లభించింది. దీంతో పాటు రూ. 50లక్షల రివార్డు కూడా కేంద్రం అందించింది. గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారాన్ని అందుకున్న సర్పంచ్ గాడ్గె మీనాక్షి. సిఎం కెసిఆర్ కృషి వల్లే తమ గ్రామానికి పురస్కారం లభించిందని సర్పంచ్ మీనాక్షి కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News