Wednesday, January 22, 2025

ఎన్ కౌంటర్లు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే: గెల్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రబాబు హయాంలో జై తెలంగాణ అంటే నక్సల్స్ ముద్ర వేసేవారని టిఆర్ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ వి సమావేశంలో గెల్లు మాట్లాడారు. 2001లో టిఆర్ఎస్ పుట్టిన నుంచే జై తెలంగాణ అనే నినాదం మార్మోగుతుందన్నారు. సిఎం కెసిఆర్ హయాంలో ఎన్ కౌంటర్లు లేని తెలంగాణగా మారిందని గెల్లు ప్రశంసించారు. ప్రస్తుతం దేశంలో ఎన్ కౌంటర్లు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్తుందన్నారు. విద్యార్థి నాయకులను ప్రోత్సహించి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని కొనియాడారు. తనతో సహా చాలా మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టిఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు. భవిష్యత్ లో కూడా ఇస్తుందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతకు అన్యాయం చేస్తోందని గెల్లు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News