- Advertisement -
హైదరాబాద్: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందని సిజెఐ ఎన్‌వి రమణ తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిర్‌టేషన్ మీడియేషన్ సెంటర్ నూతన భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవనం పూర్తి కావాలని ఆశిస్తున్నామన్నారు. దేశ న్యాయ వ్యవస్థలో అద్భుతానికి తెలంగాణ వేదికయ్యిందన్నారు. గచ్చిబౌలిలో ఎంతో విలువైన భూమిని కేటాయించారని ప్రశంసించారు. భవన నిర్మాణానికి రూ.50 కోట్టు కేటాయించినందుకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు సిజెఐ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -