Tuesday, January 21, 2025

దేశంలో గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: గడిచిన 9 ఏండ్లలో అన్ని రంగాలు అభివృద్ధ్ది చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గర్వించదగ్గ స్థాయిలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం లో సోమవారం నంది చౌక్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మపురి, బుగ్గా రం, వెల్గటూర్, పెగడపెల్లి, గొల్లపెల్లి మండలాలకు చెందిన వేలాది మంది యువకులు ఉత్సాహంతో పాల్గొనగా మంత్రి జెండా ఊపి కా ర్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిర్ నేతృత్వంలో గడిచిన 9 ఏండ్లలో ఓ వైపు అభివృద్ధ్ది, మరో వైపు సంక్షేమ రంగంలో అధ్బుతమైన ఫలితాలు సాధించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శం గా నిలిచిందన్నారు.

ఒక్కో ఇంటికి నాలుగు రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధ్ది పొంది ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, వారి ఆ నందంలో పాలు పంచుకోవడం కోసం ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల ఏర్పాటు చేపట్టిందని తెలిపారు. ఇక తెలంగాణ రన్ ద్వారా అంద రూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని కోరారు. ప్రజలు ఉత్సాహంగా ఉన్నపుడు, వారి సంతోషాన్ని పంచుకోవడానికే ఉత్సవాలు జరు పుకుంటారన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 22 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారన్నారు. మొన్న జరుపుకున్న చెరు వుల పండుగలో కోటి మంది పాల్గొని చెరువు తల్లికి, కట్టమైసమ్మకు మొక్కులు సమర్పించుకున్నారన్నారు. రైతులకు 24 గంటల నాణ్య మైన విద్యుత్ అందిస్తున్నందుకు రైతులు ఊరూరా కరెంటు పండుగను ఘనంగా జరుపుకున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష, జిల్లా ఎస్పీ ఎగ్గిడి భాస్కర్, అదనపు కలెక్టర్ మంద మకరందు, డీసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, డీస్పీ ప్రకాష్, సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై ఏలూరి కిరణ్‌కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఎంపీ పీ చిట్టిబాబు, బుగ్గారం, ధర్మపురి, వెల్గటూర్ జడ్పీటీసీ సభ్యులు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎఎంసి చైర్మన్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News