Monday, December 23, 2024

వైశాల్యం తక్కువ.. సంపద ఎక్కువ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దశాబ్దాలుగా కరువు, కాటకాలతో అల్లాడిపోయిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. గడచిన తొమ్మిదేళ్లల్లో తెలంగాణ రా ష్ట్ర ఆర్థ్ధిక ప్రగతి, అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలతో ధనిక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కిందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిగణనలోకి తీసుకునే సూచీల్లో (పారామీటర్స్) విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, క ర్ణాటక, రాజస్థాన్, పశ్చిమబెంగా ల్ వంటి రాష్ట్రాలతో భూమిపరంగా చిన్నదైన, కేవలం తొమ్మిదేళ్ల వయస్సున్న రాష్ట్రం పోటీ తోందని, ఈ విషయం ఆర్‌బిఐ నివేదికలే స్పష్టం కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య మం త్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఇండియా బ్రాండ్ ఈ క్విటీ ఫౌండేషన్ (ఐబిఈఎఫ్) గణాంకాల ఆధారంగా దేశంలో ధనిక రాష్ట్రా ల జాబితా, ఆయా రా ష్ట్రాల బలాలు అనే అంశం పై ఆర్‌బిఐ గ్రౌండ్ రిపోర్టును తయారు చేసింది.

ఈ నివేదికల ఆధారంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన కేవలం తొమ్మిదేళ్ల వ యస్సులోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటి 12 ధనిక రాష్ట్రాల జాబితాలో ఏకంగా 8వ స్థానం లో నిలిచిందని ఆ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసా య విధానంలో ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, పారిశ్రామిక, ఐటి, ఫార్మా రంగాలు, విద్యుత్తు రంగంలో చేపట్టిన సంస్కరణలు, కుల వృత్తులకు అండగా ఉన్న దళితబంధు వంటి పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ ముందుకు సాగితే రానున్న ఐదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ధనిక రాష్ట్రా ల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆర్థ్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారని ఆ అధికారులు వివరిం చా రు.

దేశంలో ధనిక రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో మహారాష్ట్ర జిఎస్‌డిపి (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) 366.67 బిలియన్ డాలర్లు (రూ. 30, 06,694 కోట్లు), రెండోస్థానంలో ఉన్న తమిళనా డు 265.49 బిలియన్ డాలర్లు (రూ.21,77,018 కోట్లు), మూడో స్థానంలో ఉన్న గుజరాత్ 259.25 బిలియన్ డాలర్లు (రూ.21,25,850 కోట్లు), నా లుగో స్థానంలో ఉన్న కర్ణాటక 247.38 బిలియన్ డాలర్లు (రూ.20,28,516 కోట్లు), 5వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 234.96 బిలియన్ డాలర్లు (19,26,672 కోట్లు), 6వ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ 206.64 బిలియన్ డాలర్లు (రూ. 16,94, 448 కోట్లు) అని, 7వ స్థానంలో ఉన్న రాజస్థాన్ 161.37 బిలియన్ డాలర్లు (రూ.13,23,234 కోట్లు) అని, ఇక 8వ స్థానంలో ఉన్న తెలంగాణ రా ష్ట్రం 157.35 బిలియన్ డాలర్లు (రూ.12,90,270 కోట్లు) అని ఆర్‌బిఐ అందుబాటులో ఉన్న సమాచారంతో లెక్కించిందని, తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర విలువ 13.27 లక్షల కోట్లు ఉం దని ఆ అధికారులు వివరించారు.

ఈ లెక్కన రాజస్థాన్ కంటే ఒక ర్యాంకు తెలంగాణ రాష్ట్రమే ఎక్కువగా ఉంటుందని, న్యాయానికి ధనిక రాష్ట్రాల్లో ఏడో స్థానంలో తెలంగాణ ఉండాల్సి ఉందని వివరించారు. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం ధనిక రాష్ట్రాల్లో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 138.19 బిలియన్ డాలర్లు (రూ.11,33,158 కోట్లు), అని, పదో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం విలువ 126.40 బిలియన్ డాలర్లు (రూ.10,36,480 కోట్లు), 11వ స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం విలువ 119.93 బిలియన్ డాలర్లు (రూ.9,83,426 కో ట్లు) కాగా 12వ స్థానంలో నిలిచిన ఢిల్లీ రాష్ట్రం విలువ 108.33 బిలియన్ డాలర్లు (రూ.8,88, 306 కోట్లు)గా ఉందని ఆర్‌బిఐ నివేదిక స్పష్టంచేసిందని వివరించారు. దనిక రాష్ట్రాల జాబితాలో 8వ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం కంటే 9వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, 10వ స్థానంలో ఉన్న మద్యప్రదేశ్ రాష్ట్రాలు రెండూ విస్తీర్ణంలోగానీ, జనాభాలోగానీ తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలేనని ఆ అధికారులు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర విస్తీ ర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు కాగా జనా భా సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం 1,62,975 చదరపు కిలోమీటర్లు ఉండగా సుమారు 5 కోట్ల మంది జనాభా ఉన్నారని, అదే విధంగా ధనిక రాష్ట్రాల్లో 10వ స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ ఏకంగా 3.08 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా ఆ రాష్ట్ర జనాభా 7.27 కోట్ల మంది ఉన్నారని వివరించారు. ధనిక రాష్ట్రాల్లో ఒకటి నుంచి ఏడో స్థానం వరకూ రాష్ట్రాలన్నీ విస్తీర్ణంలో, జనాభాలో తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలేనని వివరించారు. విస్తీర్ణంలో, జనాభాలోనే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ధనిక రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంతో సరిపెట్టుకొందని, పైగా అది డబుల్ ఇంజిన్ రాష్ట్రమని, అయినా అభివృద్ధిలో దిగువస్థానంలో ఉందని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం 2,40,928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూభాగం ఉందని, 23.56 కోట్ల మంది జనాభా ఉందని, కానీ ఆ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో జనం భాగస్వామ్యంలేదని ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయని ఆ అధికారులు ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పుణ్యమా అంటూ సమగ్రాభివృద్ధిని సాధించగలిగామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం జిఎస్‌డిపి 13.27 లక్షల కోట్లు ఉంద ని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా 3,17,115 లక్షల రూపాయలకు పెరిగిందని వివరించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని తలసరి ఆదాయాన్ని లెక్కిస్తే కేవలం 1,70, 620 రూపాయలు మాత్రమే ఉందని తెలిపారు. ధనిక రాష్ట్రాలుగా నిర్ధారించేందుకు ఆర్‌బిఐ అధికారులు ఆయా రాష్ట్రాల జిఎస్‌డిపి, తలసరి ఆదా యం, రాష్ట్రాలకు వచ్చే సొంత ఆదాయం, మానవ వనరుల అభివృద్ధి, వివిధ రంగాల్లోని పేదరిక సూచీలను పరిగణనలోకి తీసుకొంటారని, వీటితోపాటుగా విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకొని పేద, ధనిక రాష్ట్రాల జాబితాలను ఖరారు చేస్తారని ఆ అధికారులు వివరించారు.

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తొమ్మిదేళ్ల వ్యవధిలోనే ధనిక రాష్ట్రాల జాబితాలో చోటు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా టాప్ 10 రాష్ట్రాల్లో 8వ స్థానాన్ని కైవసం చేసుకోవడమంటే చి న్న విషయం కాదని, ఇది అసాధారణమైన ఘనతేనని ఆ అధికారులు సగర్వంగా వివరించారు. రా ష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఆర్థ్ధిక విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పారిశ్రామిక, ఐటి, ఫార్మా విధానాలను యథావిధిగా కొనసాగిస్తే రా నున్న ఐదేళ్లల్లో ధనిక రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా నిలుస్తుందని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు. ధనిక రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచేందుకు అనుకూలమైన లక్షాలతో ఆచరణాత్మకమైన ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆ అధికారులు వివరించారు. తప్పకుండా వచ్చే అయిదేళ్లల్లో అగ్రస్థానంలో నిలుస్తామని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News