Friday, December 20, 2024

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్

- Advertisement -
- Advertisement -

 

 

వెల్దుర్తిః అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్ అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చర్లపల్లి , శంశిరెడ్డిపల్లి తాండ గ్రామాల వైకుంఠ ధామలు, ఆరెగూడెం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, దామరంచ గ్రామంలో రూ. 9 లక్షలతో నిర్మించిన బిసి యాదవ్ సామూహిక భవనము, ధర్మారం గ్రామంలో రూ. 20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులు, అందుగులపల్లి గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు అలాగే రూ. కోటి 42 లక్షలతో నిర్మించిన 33/11 కేవి సబిస్టేషన్‌ను, మహ్మద్ నాగర్ తాండ గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రమేష్‌గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ పార్టీ పేదలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుపేదలకు పెళ్లి భారం కావద్దనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకంలో రూ. 1,00,116ల చొప్పున అందిస్తున్నారని, ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ సర్కార్ డబ్బులు ఇవ్వడం తెలంగాణలో మాత్రమే ఉందని, ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

స్వరాష్ట్రంలో సిఎం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. అంతకముందు లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మెదక్ మార్కెట్ కమీటి డైరెక్టర్ రమేష్‌చందర్, సోసైటి చైర్మన్ అనంతరెడ్డి, వెల్దుర్తి ఎంపీటీసీ2 మోహన్‌రెడ్డి, మాసాయిపేట మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో జగదీశ్వరచారి, ఆర్‌ఐ సందీప్, ఏపివో రాజు, ఏఈ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ అంజనేయులు, విద్యుత్ శాఖ అధికారులు, సర్పంచ్‌లు శాంతి, పల్వంచ శేఖర్, బాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శంకర్ యాదవ్, వినోధ, సుజాత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News