Saturday, December 21, 2024

యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్

- Advertisement -
నిరంతర విద్యుత్ సరఫరాలో ప్రథమ స్థానం
డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం
రైతుబంధు ద్వారా 65 లక్షలమందికి ప్రయోజనం
ధరణి పోర్టల్‌తో భూముల సమస్యకు పరిష్కారం
సిఐఐ సిఎఫ్‌ఓ కాన్‌క్లేవ్ సమావేశంలో మంత్రి హరీష్ రావు

- Advertisement -

హైదరాబాద్ : దేశంలో సీఎఫ్‌వోలు ఏ సంస్థకైనా వెన్నెముక అని, సాంకేతిక పరిజ్ఞానంతో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారని సిఎఫ్‌వోలు సంస్థలను బలోపేతం చేసే, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే జాతీయ,అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అవలంబించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. శుక్రవారం తెలంగాణ కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సీఎఫ్‌వో నాలుగో ఎడిషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత 9 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 40వేల కోట్లతో పటిష్టమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థను నిర్మించి రాష్ట్రంలోని గృహాలకు, పరిశ్రమలకు నిరంతర మంచి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మిగులు, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రం 25 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చురుకైన మార్గంలో డిజిటల్ టెక్నాలజీలను అవలంబించిందని, రైతుబంధు ప్రయోజనాలను 65 లక్షల మంది రైతులకు బదిలీ చేశామని, ఒకే రోజు 44 లక్షల మందికి ఆసరా పింఛన్లు బదిలీ చేసినట్లు వెల్లడించారు. ధరణి పోర్టల్ భూముల రిజిస్ట్రేషన్లలో పెద్ద సానుకూల మార్పును తీసుకువచ్చిందని ప్రజల కోసం మంచి పరిపాలన అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నట్లు దాదాపు 3 లక్షల మెగాటన్నులు పండిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మూడున్నర సంవత్సరాలలో నిర్మించినట్లు, రాష్ట్రంలోని శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్, నీటి లోటు రాష్ట్రం నుంచి మిగులు రాష్ట్రంగా తెలంగాణ సాధించిందని వ్యవసాయం, పరిశ్రమలు, సంక్షేమం తదితర అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధిపై రాష్ట్రం దృష్టి సారించిందన్నారు.
అనంతరం సిఎస్‌ఆర్ ఎస్టేట్ చైర్మన్ శేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ ఫైనాన్స్ లీడర్లు సాంకేతికతలను స్వీకరించాలని, సైబర్ భద్రతా చర్యలలో పెట్టుబడి పెట్టాలని, డిజిటల్ విభజనను తగ్గించడానికి సమగ్రతను నిర్ధారించుకోవాలని చెప్పారు. టైర్- II పట్టణాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నందుకు ఆయన ప్రశంసించారు సిద్దిపేటలోని ఐటీ టవర్లు ఐజిబిసి గోల్ రేటింగ్ పొందడం, పట్టణం రోల్ మోడల్‌గా ఎలా అభివృద్ధి చెందుతోందని ప్రస్తావించారు. అదే విధంగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కన్వీనర్ నరసింహం మాట్లాడుతూ సీఎఫ్‌వోలు డిజిటల్ పరివర్తనకు నాయకత్వం వహిస్తారని సుస్థిరత లక్ష్యాలకు మద్దతు ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారుల బలమైన ఈఎస్‌జి ఫ్రేమ్‌వర్క్ కోసం కూడా పట్టుబడుతున్నారని దీర్ఘకాలిక విలువ పనితీరు కోసం అడుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో, పాలనా ప్రక్రియల్లో పారదర్శకత, సమర్థత జవాబుదారీతనం మెరుగుపరచడానికి సాంకేతిక పురోగతులు మాకు కొత్త అవకాశాలను అందిస్తాయన్నారు. ఈకార్యక్రమంలో ఆనంద్ దగా, ప్రవీణ్ బీమవరం, రాజేష్ దుడ్డు, అనిర్‌బన్ గోష్, సంతు ముఖర్జీ, సంజయ్, శ్రీహర్షరెడ్డి పాల్గొన్ని పలు సూచనలు చేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News