Saturday, November 16, 2024

వరిలో లేరు సరి

- Advertisement -
- Advertisement -

Telangana is second largest paddy grain procurement state in India

 

2019-, 20 ఖరీఫ్ సీజన్‌లో 111.26 లక్షలు,
2020,-21 ఖరీఫ్ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఇది సాధ్యమయ్యింది
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : వరి ధాన్యం సేకరణలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ మనరాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని సమాధానం ఇచ్చింది. 2020,-21 ఖరీఫ్ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని, 2019-, 20 ఖరీఫ్ సీజన్‌లో 111.26 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ నుంచి సేకరించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఇది సాధ్యమయిందన్నారు. ఆకలిదప్పుల తెలంగాణ అన్నపూర్ణగా మారడానికి ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కల్పన, ఉచిత కరంట్, రైతుబంధు, రైతుభీమా పథకాలతో రైతన్నలకు అండగా నిలవడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను నెలకొల్పిన ఏకైక రాష్ట్రం

ఏటా 25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంట్ వంటి పథకాలకు దాదాపు రూ.60 వేల కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం మారాలంటే 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం బలపడాలన్న ముందుచూపుతో సిఎం కెసిఆర్ ప్రణాళికబద్దంగా ముందుకెళ్లడంతోనే ఇది సాధ్యమయిందన్నారు. రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ప్రపంచంలో రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అభివర్ణించారు. దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని ఆయన పేర్కొన్నారు.

కరోనా విపత్తులోనూ రైతు నష్టపోకూడదని, ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న రెక్కల కష్టానికి ఫలితం దక్కాలని వంద శాతం పంటలను సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. ముమ్మాటికీ ఇది రైతు ప్రభుత్వమని, వ్యవసాయ రంగం మరింత బలోపేతం చేయడంతో పాటు, రైతు పంటకు తగిన మద్దతు ధర దక్కాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దేశంలో ప్రత్యేకంగా మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను నెలకొల్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి రాజ్యసభ సాక్షిగా వెల్లడయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News