Monday, December 23, 2024

దేశంలోనే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

నాలుగేళ్లలో జిఎస్టీ వసూళ్లలో 69 శాతం వృద్ధిరేటు నమోదు
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తక్కువ కాలంలోనే చెప్పుకోదగ్గ ఆర్ధిక వృద్ధిని నమోదు చేస్తూ నాలుగేళ్లలో వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) వసూళ్లలో రాష్ట్రం 69 శాతం వృద్ధి రేటును సాధించింది. ఈ అద్భుతమైన ఫలితాలను సాధించడంలో వాణిజ్య పన్నుల శాఖ కీలక పాత్ర పోషించింది. కొత్త సర్కిళ్ల స్థాపన, ప్రతి స్థాయిలో స్పష్టమైన లక్ష్యాలు, మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల రద్దుతో సహా వివిధ సంస్కరణలు పన్ను ఆదాయంలో గణనీయమైన వృద్ధికి వాణిజ్య పన్నుల శాఖ దోహదపడింది.

తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు
తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మెరుగైన ఆర్థిక పరిస్థితుల కారణంగా పౌరుల కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా వ్యాపార రంగం వృద్ధి చెందుతూ జిఎస్ట్టీ రాబడి పెరగడానికి దోహదపడిందని అధికారులు పేర్కొంటున్నారు. పటిష్టమైన ఆర్థిక వ్యూహాంతో, ఆర్థిక వనరుల సమర్ధవంతమైన వినియోగంతో రాష్ట్రం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.

కాగ్‌కి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం తెలంగాణ జిఎస్టీ ఆదాయం 2018-,19లో రూ. 28,786 కోట్ల నుంచి 2022-,23 నాటికి రూ. 41,889 కోట్లకు పెరిగింది. కోవిడ్ -19 తరువాత తెలంగాణ జిఎస్టీ వసూళ్లలో దూకుడును కొనసాగించిందని కాగ్‌కు సమర్పించిన ఆడిట్ రిపోర్ట్‌లో ఇది వెల్లడయ్యింది. 2018-,19 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం జిఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు జిఎస్టీ ఆదాయంలో రూ. 28,786 కోట్లు వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలు రూ. 34,232 కోట్లలో 84 శాతానికి సమానమని నిపుణులు పేర్కొంటున్నారు.

2022-,23లో రూ. 41,889 కోట్ల వసూళ్లు
2019,-20లో అంచనా వసూళ్లు రూ.31,186 కోట్లు కాగా, బడ్జెట్ అంచనాల్లో 90 శాతం వాటాతో తెలంగాణ రూ.28,053 కోట్లు వసూలు చేయగలిగింది. 2020-,21 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,671 కోట్ల అంచనా వేయగా రూ. 25,905 కోట్లు వచ్చాయి. ఇది బడ్జెట్ అంచనాలో 80 శాతానికి సమానమని ఆర్ధిక నిపుణులు తెలిపారు. 2021,-22లో రూ. 35,520 కోట్లు అంచనా వేసి, రూ. 34,489 కోట్లను రాబట్టగా ఇది బడ్జెట్ అంచనాల్లో 97 శాతంగా నమోదయ్యింది. అదేవిధంగా, 2022-,23లో అంచనా వసూళ్లు రూ. 42,189 కోట్లు కాగా, బడ్జెట్ అంచనాల్లో 99 శాతానికి సమానంగా రూ.41,889 కోట్లు వసూలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News