Monday, December 23, 2024

అమరుల త్యాగఫలం తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి

చిన్నశంకరంపేట: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి గురువారం తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరులకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసంపోరాడి ప్రాణాలు ఆర్పించిన దేశంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనన్నారు. అమరవీరుల ఆశయాలు సాదిద్దామన్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజు అయిన తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించాలనే ఉద్దేశంతో గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడైతే తెలంగాణ అస్తిత్వ చిహ్నమైన తెలంగాణ భవనాన్ని కూల్చివేశారో ఆ స్థలంలోనే తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి అమరులకు ఘనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నివాళులు అర్పిస్తున్నదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

గొప్ప అమరవీరుల స్మారక చిహ్నాన్ని గురువారంసాయంత్రం సిఎం కెసిఆర్‌చేత ప్రారంభించడం జరుగుతుందని ఈ ప్రారంభం తెలంగాణ అమరువీరులకు గొప్ప నివాళి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, నార్సింగి జడ్పిటిసి కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, సర్పంచ్‌లు పూలపల్లి యాదగిరి యాదవ్, బందెల జ్యోతిప్రభాకర్, ఎంపిటిసి అనురాధ, కామారం ప్యాక్స్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మండల నాయకులు సుధాకర్, మనోజ్, సిద్దిరాములు, బిక్షపతి, రమేష్‌గౌడ్, లకా్ష్మగౌడ్,బాబు, లింగంగౌడ్, ఎర్రి కుమార్, ఉప సర్పంచ్ జీవన్, యువ నాయకులు శ్రీనునాయక్, రమేష్‌గౌడ్, సుదాకర్ నాయక్‌తోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, డిఎస్పి యాదగిరిరెడ్డి, సిఐ టాటా లక్ష్మిబాబు, ఎస్‌ఐలు సుభాష్‌గౌడ్, ప్రకాశ్‌గౌడ్, తహశీల్దార్ మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News