Thursday, January 16, 2025

ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా మన రాష్ట్రం నిలిచిందని చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శారద 1 గార్డెన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గ స్థాయి వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మార్పులు తీసుకవచ్చి ప్రజలకు మంచి సేవలను అందించడం జరుగుతుందన్నారు.

నిజాం తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా ఒక్క ఆసుపత్రిని కూడా కట్ట లేదని చెప్పారు. కేసిఆర్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులను కట్టించారన్నారు. గతంలో రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించిన ఘనత కేసిఆర్‌దే అన్నారు. నీతి అయోగ్ సర్వేలో రాష్ట్ర వైద్య రంగం దేశంలో మంచి స్థానంలో ఉందన్నారు. మహిళ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఎనిమిది రకాల వ్యాధులకు చికిత్సలతో పాటు వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు.

జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని, కంటి వెలుగు ద్వారా కోటి 50 లక్షల మందికి పరీక్షలు చేసి 40 వేల మందికి కంటి అద్దాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో అనేక సంస్కరణలు చేసిన ఘనత కేసిఆర్‌దే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. పరిగిలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి అందులో కనీస మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. డయాలాసిస్ సెంటర్‌ను ఇటీవలే నూతనంగా ప్రారంభించామని తెలిపారు. ఆసుపత్రి చుట్టూ ప్రహారీ గోడ, మార్చూరీ గది నిర్మాణం పనులు మంజూరు చేశామన్నారు.

ప్రైవేట్‌కు దీటుగా 90 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసూతి సౌకర్యం కల్పించామన్నారు. 9 వేల 200 మందికి కేసిఆర్ కిట్లను 11 కోట్లకు పైగానిధులు ఇవ్వడం జరిగిందన్నారు. కంటి వెలుగులో లక్ష 54 వేల మందికి పరీక్షలు చేయడం, ఇందులో 25 వేల మందికి కంటి అద్దాలు అందివ్వడం జరిగిందన్నారు. ఎన్‌సిడి కిట్లు 10 వేల 800 మందికి వివిధ రకాల మందులను పంపిణీ చేశామన్నారు. రూ. 23 కోట్ల వరకు సిఎం ఆర్‌ఎఫ్ నిధులు ఇప్పించడం జరిగిందన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ఎంత సంపాదించిన మనిషికి ఆరోగ్యం లేకుంటే జీవితం వృధానే అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ముఖ్యంగా హెల్త్ సిబ్బంది బాగా పని చేశారని గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పని చేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డిపిఓ తరుణ్‌కుమార్, మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, జిల్లా వైద్యాధికారి పాలాల్వాన్ కుమార్, మండల ప్రత్యేకాధికారి దీపారెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి, జడ్‌పిటిసి హారిప్రియారెడ్డి, ఎంపిపి కరణం అరవింద్‌రావు, ఏఎంసీ ఛైర్మన్ సురేందర్, ఆయా మండలాల ఎంపిపిలు మల్లేశం, అనుసూజ, సత్తమ్మ, జడ్‌పిటిసిలు నాగిరెడ్డి, మేఘమాల, రాందాస్, శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ ఛైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర్, ప్రవీణ్‌రెడ్డి, ఆర్.ఆంజనేయులు, కౌన్సిలర్‌లు కిరణ్‌కుమార్, వారాల రవీందర్, ఎదిరే కృష్ణ, నాగేశ్వర్, వెంకటేష్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News