Wednesday, January 22, 2025

పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : దేశంలో పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. సోమవారం జడ్చర్ల సమీపంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో హరిత దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డితో కలిసి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ రాకపూర్వం తాగునీరు, సాగునీటికి అన్నిటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్తు అన్ని సౌకర్యాలతో పేదల కళ్లల్లో ఆనందం కనబడుతున్నదని అన్నారు. ముఖ్యంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద దేశంలో పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, అంతేకాక 97 శాతం రక్షిత మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

గతంలో తండాలలో పైపులైన్ వెళ్లినప్పటికి తాండాకు తాగునీరు ఇవ్వలేదని, గిరిజనులను మనుషులుగా సైతం చూడలేదని, తాగునీరు, విద్య, వైద్యం వంటి వాటికి నోచుకోక గిరిజనులు గ్రామాలకు దూరంగా గడిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియచెప్పేందుకు 22 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరు మీద  ఊరూరా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నదని, దీనిని అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి చేయడంలో శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరి సహకారంతో ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ , డిఐజి ఎల్ ఎస్ చౌహన్, ఎస్పీ నర్సింహ, డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, జడ్పి వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, మా ర్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్, కౌన్సిలర్లు తదితరు లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News