Sunday, December 29, 2024

ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఉండవల్లి: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్షాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే డా.విఎం. అబ్రహం అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 7 మండలాల పరిధిలో గ్రామాల వారికి 3 మున్సిపాల్టీ పరిధిలోని బిసి కులవృత్తులకు రూ. లక్ష చెక్కులను 294 మంది లబ్దిదారులకు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతి వృత్తులు చేసుకొని జీవిస్తున్న వెనకబడిన తరగతుల వారికి రూ. లక్ష ఆర్ధిక సహయం అని వారు అన్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో రూ. 70 పెన్షన్ ఇస్తే నేడు వృద్దులకు, వితంతువులకు , చేనేత కార్మికులకు , బీడీ కార్మికులకు రూ. 2016లను, వికలాంగులకు రూ. 3016 నుండి రూ. 4016 అందిస్తున్న ప్రభుత్వం అని ఆయన తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం దేశానికి ఆదర్శం నిలుస్తుందని వారు తెలిపారు.

పేదింటి ఆడపిల్లకు మేనమామగా సిఎం కేసిఆర్ అని ఆయా అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ అని, స్వరాష్ట్రంలో అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కేసి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు. కస్తూర్భా గాంధీ, మహత్మాగాంధీ రావుపూలే , మోడల్ స్కూల్స్ , ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యా, నాణ్యమైన భోజన వసతి, కల్పించి పేదవారికి ఘనమైన విద్యను అందిస్తున్న రాష్ట్ర తెలంగాణ అని అన్నారు.

ప్రజా పరిపాలన దార్శినికుడు సీఎం కేసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News