కరీంనగర్ : సర్వ మతాల వేదిక తెలంగాణ అని మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీటవేస్తుందనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని ముకరంపుర లో కరీంనగర్ టౌన్ బిఆర్‌ఎస్ మైనార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
మేయర్ సునీల్ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ లతో కలిసి మొదట బిఆర్‌ఎస్ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం కార్యాలయాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మీర్ శౌకత్ అలీ, నాయకులు మతిన్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బిఆర్‌ఎస్ లో చేరగా మంత్రి గంగుల వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగా ణ నేడు సురక్షితంగా ఉందంటే కారణం శాంతి భద్రతల పరిరక్షణ అని, అన్ని మతాల పండుగలను, వారి సాంప్రదాయాలకు అనుగు ణంగా ప్రాధాన్యతను ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి కొ నసాగుతుందని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కరీంనగర్ లో మతాల మధ్య ఘర్షణ పెట్టి కొంతమంది రాజకీయం చేయాలని చూశారని, కాని అలాంటి కుట్రలను తిప్పి కొట్టమన్నారు.
తెలంగాణలోనే కరీంనగర్ ను అభివృద్దిపథంలో తీసుకువెళ్తున్నామన్నారు. తెలంగాణలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుంది. కెసిఆర్ సహకారంతో నగరానికి పెద్ద ఎత్తున నిధులను తీసుక వచ్చామని.. దీంతో కరీంనగర్ రాష్ట్రంలోనే హైద రాబాద్ తర్వాత 2వ నగరంగా అవతరించిందన్నారు. మీ సహాకారంతో మరింత అభివృద్ధ్ది చేస్తామన్నారు.
ఈ నెల 21 ప్రారంభం కాబో యే కేబుల్ బ్రిడ్జీకి డైనమిక్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందన్నారు. ఆగష్టు 15వ తేదీన మానేర్ రివర్ ఫ్రంట్ మొదటి దశను ప్రారంభించుకుని… ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది… కరీంనగర్ షాన్ పెంచుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు మీర్ షౌకథ్ అలి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ వాజీద్,యువజన విభాగం నగర అధ్యక్షుడు దీకొండ కుల్దీప్ వర్మ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అంజద్ అలి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు శాబీర్, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జమీలోద్దిన్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు