Tuesday, November 5, 2024

ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : ఎన్నో సంవత్సరాల అలుపెరుగని పోరాటం, ఎంద రో అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు పుష్పగుచ్చాలతో ని వాళులర్పించి శ్రద్దాంజలి ఘంటించారు.

అంతేకాకుండా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అ నంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరా లు కోట్లాది మంది ప్రజల అలుపెరుగని పోరాటాలకు గుర్తుగా, వేలాది మంది ప్రాణత్యాగానికి ప్రతిఫలంగా తెలంగాణ వచ్చిందని అన్నారు. తొలి ద శ, మలిదశ ఉద్యమంలో ఎందరో తమ అసువులను బాసి తెలంగాణ సాధించారని, సాధించుకున్న తెలంగాణలో నాటి ఉద్యమ దృశ్యాలు తనకు ఇప్పటికీ కళ్ల ముందు సాక్షాత్కారమవుతున్నాయని తెలిపారు.

నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఎలా అభివృద్ధ్ది అయిందో తెలియజేసేందుకు ఈ 21 రోజుల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందని, సంక్షేమం, అభివృద్ధ్ది రెండు పోటీపడి రాష్ట్రంలో నడుస్తున్నాయ ని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప ని చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆ దర్శంగా నిలిచిందని, ఏ రాష్ట్రంలో లేని ప్రగతి తెలంగాణ రాష్ట్రంలో ఉందని, ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న ప్రజలు ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులను గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం తెలంగాణను గతంలో చిన్నాభిన్నం చేశారని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం అందరికీ గర్వకారణమన్నారు.

అనంతరం అమరుల కుటు ంబాలైన అనిల్‌కుమార్ రెడ్డి తల్లి, బి. మల్లేష్ తల్లి మణెమ్మ, బోయ చెన్నయ్య భార్య రాములమ్మలను మంత్రి సత్కరించారు. అదే విధంగా ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు మాచన్‌పల్లి తండా లో నిర్వహించిన విఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించి విజేతగా నిలిచిన చంద్రశేఖర్ ఎలెవెన్ క్రికెట్ జట్టుకు ట్రోఫి, రూ. 25వేలు నగదు అందించారు. క్రీడారంగంలో తెలంగాణ దే శానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

ఈ కా ర్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడ్గల్ యాదయ్య, జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ , అడిషనల్ కలెక్టర్ కె. సీతారామారావు, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్యయాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్,జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, ముడా చైర్మన్ గంజివెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, అమరవీరుల స్తూపం వద్ద అమరులకు పుష్పాంజలి ఘటించి శ్రద్దాంజలి ఘటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News