- Advertisement -
- మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి
కీసర: అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం నాగారంలో తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ అమరవీరుల స్థూప చిత్రపటానికి నివాళులర్పించి, స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎ.వాణిరెడ్డి, వైస్ ఛైర్మన్ బి.మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -