ఇల్లందు :తెలంగాణ సాధనలో ఉద్యమించి అమరులైన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని స్థానిక ఎంఎల్‌ఎ బానోత్ హరిప్రియ హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక జగదాంబసెంటర్‌లో నిర్వహించిన అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గోని తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలవేసి అమరుల స్ధూపానికి నివాళులు అర్పించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు. ఉద్యమకారులను ఎన్నటికి మర్చిపోమని వారికి అన్నివిధాలుగా అండగా వుంటామన్నారు. అనంతరం అమరుల కుటుంబసభ్యులను, ఉద్యమకారులను, కళాకారులను ఘనంగా ఎమ్మెల్యే సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్‌చైర్మన్ జానీపాష, మున్సిపల్ కమిషనర్ అంకుషావళి, టిజిబికెఎస్ ఉపాధ్యక్షుడు రంగనాథ్, ఉద్యమకారులు సిలివేరు సత్యనారాయణ, డేరంగుల పోశం, మేకల శ్యామ్, సుబ్బారావు, దేవిలాల్‌నాయక్, భావ్‌సింగ్, ఆదూరి రవి, రమేష్‌గౌడ్, దండా రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.