- రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను పొగొట్టుకున్నారని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మెన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య తదితరులు ప్రాణాలు అర్పించారన్నారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అమరుల కుటుంబాలను దగ్గరకు చేర్చుకొని వారి కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటామన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం 2నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మెన్ శివకుమార్, సిడిసి చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్‌పిటిసిలు పద్మావతి పాండురంగం, కొండల్‌రెడ్డి,మీనాక్షి, జడ్‌పి సిఇఓ ఎల్లయ్యలున్నారు.