Saturday, December 21, 2024

అమరుల త్యాగఫలమే తెలంగాణ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అమరవీరుల ప్రాణ త్యాగాలు తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించాయని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య తమ విలువైన ప్రాణాలను అర్పించారని, అమరవీరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం అన్నారు. అమరుల త్యా గాలను వెలకట్టలేమని అన్నారు.అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. పోలీస్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలి చామని తెలిపారు. ఆయన బిడ్డ ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తుందన్నారు.

అమరవీరుల త్యాగాలను మరిచిపోము ఎప్పటికీ స్మరించుకుంటాం అ న్నారు. జనవరి26, జూన్2న ఆగస్టు 15, అమరవీరులను స్మరించుకుంటున్నామని అమరుల త్యాగాలే నానా అభివృద్ధికి మూలమని అన్నారు. సమైక్య పాలకులు మన గోదావరి నీటిని మన బొగ్గును దోచుకున్నారని, గోదారి తెలంగాణలో ప్రవహించనంత దూరం ఎక్కడ కూడా ఆగకుండా పరుగులు తీసేదని, మనకి గోదావరి నది ఉన్న,ఎన్టీపీసీ ప్లాంట్ ఉన్న సాగునీటి, కరెంటు ఇబ్బందులు తప్పలేదన్నారు.

గతంలో సరియైన అవకా శాలు లేక యువత దుబాయ్ బొంబాయి చేసేవారని, వలసలు ఎక్కువగా ఉండేవని అన్నారు. పవర్, క్రాప్ హాలిడే ఇచ్చేవారన్నారు. ఇప్పుడు స్వ యం పాలనలో గోదావరి నది పై కాలేశ్వరం వద్ద ప్రాజెక్టును కట్టి సాగునీటి ఇబ్బందులు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ దని మన బొగ్గు మనకు రావడంతో కరెంటు ఇబ్బందులు లేకుండా పోయాయి. అమరవీరుల కుటుంబాలను ఆక్కున చేర్చుకొనే తీర్మానం నకు సభ్యులు సంపూర్ణ ఆమో దం తెలిపారు. ఈ సందర్భంగా31 మంది అమరుల కుటుంబ సభ్యులకు మంత్రి సన్మానించారు.

సర్పంచ్‌లకు మంత్రి చేతుల మీదుగా సన్మానం :

జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామపంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా సన్మానించారు. ముందుగా అమరవీరుల జ్ఞాపకార్థం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మా ట్లాడుతూ అమరుల త్యాగం వల్లనే తెలంగాణ సాధిం చుకున్నామని వారి త్యాగఫలమే తెలంగాణ అభివృద్ధికి మూలం అన్నారు. అమరులను స్మ రించుకునేందుకు ఈరోజు విశేష సమావేశం జిల్లా పరిషత్, మున్సిపల్ గ్రామపంచాయతీ లలో ఏర్పాటుచేసి ప్రత్యేక తీర్మానం చేయడం జరిగిం దన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News