Wednesday, January 22, 2025

దేశంలో సేఫెస్ట్ ప్లేస్‌గా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పి చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్సి రక్షిత కె మూర్తి, పోలీస్ అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి జిల్లా జెడ్పి చైర్మెన్ లోక్ నాథ్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్, జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, అడిషనల్ ఎస్పి షాకీర్ హుస్సేన్, పోలీస్ అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారథ్యంలో నేడు దేశంలోనే తెలంగాణ పోలీసులు అన్ని విభాగాల్లో ముందున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజల శాంతి భద్రతలను కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్‌గా ఉందన్నారు. అమరవీరులకు నివాళులర్పించిన వారిలో జిల్లా అన్ని శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News