Monday, December 23, 2024

దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. తెలంగాణతో తనకు 2008 నుంచి మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ అభివృద్ధి చేసి తీరుతామన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని ఆయన తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫార్సులన్నీ పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు.

ఆనాడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించామన్నారు. గ్యాస్ సిలిండర్ ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి చూపుతామన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉందని, గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికమని, రాష్ట్రంలో 15.1 శాతంగా ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News