Thursday, December 19, 2024

దేశంలోనే ధాన్యం పండించడంలో తెలంగాణ అగ్రభాగం

- Advertisement -
- Advertisement -

నల్గొండ:ఒకప్పుడు మూడు లక్షల టన్నుల ధాన్యం పండించలేని తెలంగాణ రాష్ట్రం ఈనాడు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణ అగ్ర భా గాన నిలిచిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వె చ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నవీకరించిన మొదటి అంతస్తు భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు.

1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ంలో ఎంతోమ ంది బలిదానాలు చేసినా సం కుచిత రాజకీయాలతో తెలంగాణను అడ్డుకున్నారని పేర్కొన్నారు. నేడు కేసీఆర్ నాయకత్వంలో అకుంఠిత దీక్షతో అ హింసా పద్ధతులతో మీ అందరి సహకారంతో చావు అం చుల వరకు వెళ్లి, ఢిల్లీ నాయకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని అ న్నారు. తెచ్చిన తెలంగాణాన్ని బం గారు తెలంగాణగా దేశంలోనే అగ్రభాగాన నిలిపారని, కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు.

శాసనసభ్యుగా తనను గెలిపించిన తర్వాత కెసిఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ ను 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి సుందర నందన వనంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికి కేవలం 25% పనులు మాత్రమే పూర్తయ్యాని మరో 75% పనులకు నిధులు కేటాయించబడి పనులు పురోగతిలో ఉన్నాయని, మరో రెండు సంవత్సరాల తర్వాత అవి పూర్తి అయ్యి నల్లగొండ రూపురేఖలే మారతావని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News