Sunday, December 22, 2024

సకల జనుల సౌభాగ్య తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఈ లక్ష్యసాధన కోసం అందరూ కలిసి పనిచేయాలి

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి : సకల సౌభాగ్య తెలంగాణ నిర్మాణ మే తమ లక్ష్యమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సకల విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అందుకే బిజెపి వైపు చూస్తున్నారని ఇప్పుడు తెలంగాణలో బిజెపి గాలి వీస్తోందన్నారు. ‘జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డును ప్రజలు చూశారు. బిజెపి ఏం చెబుతుందో అది చేసి తీరుతుంది. 370 ఆర్టికల్ తోపాటు త్రిపుల్ తలాక్ రద్దు, రైతులకు ఒకటిన్నర రేట్ల గిట్టుబాటు ధర, చట్టసభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు, రామమందిర నిర్మాణం, పసుపు బోర్డు, సై నికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తదితర హామీలను నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ పసుపు బోర్డు ఇస్తున్నాం’ అని అన్నారు.

రా ష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారెంటీగా పూర్తి చేయడమే అని స్పష్టం చేశారు. ఒబిసికి చెందిన నన్ను బిజెపి ప్రధాన మంత్రిని చే సిందని, తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి ని చేస్తామన్నారు. కేంద్ర మంత్రివర్గంలో రికార్డు స్థాయిలో మంత్రులు ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ దళితులకు ఏమీ చేయలేదని, వారిని కేవలం ఓటు బ్యాంకు గా వాడుకుందని ఆరోపించారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి అన్యా యం జరుగుతుందని గుర్తించి వర్గీకరణ కోసం కమిటీ వేశామని, ప్రక్రియ వేగవంతంగా సాగుతుందన్నారు. తెలంగాణలోని పేదలు, మహిళలు, రైతులు, యు వత, దళితుల ఆకాంక్షలను మా మేనిఫెస్టో ప్రతిబింబిస్తున్నదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం బిజెపి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా రెండు లక్షల 75 వేల కోట్లకు పైగా రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని, దీంతో 40 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతుందన్నారు. ఇందులో కామారెడ్డికి చెందిన లక్షా 50వేల మంది రైతులు లబ్ధ్ది పొందుతున్నారని చెప్పారు. అలాగే ఖరీఫ్ సీజన్లో 20 లక్షల టన్నుల వరిధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేస్తున్నామని, దీంతో తెలంగాణ రైతులకు ఎంతో ఉసపయోగపడుతుందన్నారు. రైతులకు అదనంగా ఆదాయం కోసం బాయిల్డ్ రైస్‌తో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో చెరుకు రైతులకు మేలు జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ గతంలోని యూపిఎ పేరు మార్చి ‘ఇండియా కూటమి’గా ఏర్పడి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని, కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ అందించామని జన్‌ధన్, ముద్ర పథకాలకు పేదల కోసం ప్రవేశపెట్టామన్నారు. పేదలను ఆదుకోవడానికి మరో ఐదు సంవత్సరాలు 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బిజెపి మీ బిడ్డల కోసం పని చేస్తుందని అందుకే కమలం గుర్తుకు ఓటు వే యాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, జుక్కల్ అభ్యర్థి అరుణతార, బాన్సువాడ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ, నారాయణ్‌ఖేడ్ అభ్యర్థి సంగప్ప, ఒబిసి జనమోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్, జహీరాబాద్ ఇన్‌ఛార్జి రవిగౌడ్ తదితరులు ప్రసంగించారు. సంకల్ప సభకు జిల్లా నలుమూలల నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News