Monday, December 23, 2024

తలసరి ‘సరిలేరు మనకెవ్వరు’

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పనితీరుకు ఇది గీటురాయి
అప్పులు ఆర్థిక క్రమశిక్షణలో 5వ స్థానం

హైదరాబాద్ : తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో సభ్యులు బాల్కసుమన్, ఆరూరి రమేష్ ,మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరలు అడిగిప ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.తలసరి ఆదాయానికి సంబంధించి గత తొమ్మిదేండ్లుగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్, హర్యానను దాటి తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు.జీఎస్డీపీ రూరల్ సెక్టార్ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందన్నారు.నిర్మాణ రంగం టీఎస్‌ఐపాస్ ద్వారా అత్యంత వేగంగా అనుమతులివ్వడం వల్ల పారిశ్రామిక ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు.సర్వీస్ సెక్టార్ అభివృద్ధి చెందిందన్నారు. అర్భన్ ఎకానమీ అభివృద్ధిపై ఆధారపడి ఉందని ఈ నాలుగు రంగాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందటం వల్ల జీఎస్డీపీ పెరిగిందని వివరించారు.

దేశ తలసారి ఆదాయం రూ. 1,72,276లు కాగా , తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,12,398లు ఉందని తెలిపారు.దేశ తలసరికంటే రాష్ట్ర తలసరి ఆదాయం 1.5 రెట్లు అధికంగా ఉందని తెలిపారు. క్యాపిటల్ ఎక్స్ పెండ్ బుల్ దేశం కంటే ఇరవై శాతం ఎక్కువగా తెలంగాణ చేస్తుందని తెలిపారు. దేశంలో అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ జాతీయ సూచికలో కింద నుండి ఐదో స్థానంలో ఉందని తెలిపారు. ఆర్ధిక క్రమశిక్షణ వల్లనే ఇది సాధ్యపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ఇంకా రూ 800కోట్లు జీఎస్టీ నిధులు బకాయిలు రావాల్సివుందని తెలిపారు.

తెలంగాణ జీడీపీ 12.07శాతం ఉండగా , దేశం యొక్క జీడీపీ 10. 5 శాతం ఉందన్నారు.జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన కొత్తలో రూ. 4,51,580 కోట్లు ఉండగా, ఇది నేడు రూ. 13,13,391 కోట్లకు పెరిగిందని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇది గీటు రాయిగా నిలుస్తుందన్నారు. సాగునీటి సదుపాయాలను అందుబాటులో కి తేవడం, జల వనరుల పునరుద్దరణకోసం చేపట్టిన లక్షిత ప్రాజెక్టులు , వ్యవసాయదారులకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా కల్పించడం , వ్యవసాయ కార్యకలాపాల యాంత్రీకరణ వంటి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆర్ధిక వ్యవస్థ అనేక రంగాల్లో కనబరిచిన ఉత్తమ పనితీరు కారణంగా గ్రామీణ ఆదర్ధిక వ్యవస్థలో మెరుగుదల పనులకు వీలు కల్పించే ప్రాధమిక రంగంలో గణనీయమైన అభివృద్ధికి తోడ్పడిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తలసరి ఆదాయం రూ.1,12,163 ఉండగా – నేడు తలసరి ఆదాయం రూ. 3,12,398లకు పెరిగిందని మంత్రి హరీష్ రావు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News