Saturday, January 11, 2025

నీతి ఆయోగ్ ఇండెక్స్‌లో తెలంగాణకు మూడో స్థానం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర ఆయుర్వేదిక్ వైద్యుల కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య చరిత్రలో 1200 మందికి ఒకేసారి ఎంఎల్‌హెచ్‌పిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.

ప్రపంచాన్ని అతాలంకుతలం చేసిన కరోనా మహమ్మారికి జీవన్ ధార ఆయుర్వేద మందు భరోసాగా నిలిచిందని గుర్తు చేశారు. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. 1987లో డెయిలీ వేజేస్‌పై ఆయుర్వేద వైద్యుల భర్తీ జరిగితే 1999లో, 2006లో, 2011లో భర్తీ జరిగింది. ఈ నాలుగు సార్లు చేసిన ప్రక్రీయ ద్వారా మొత్తంగా 400 మందికి కూడా అవకాశం రాలేదని గుర్తు చేశారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం ద్వారా ఒకేసారి 1154 మందికి అవకాశం కల్పిగించిందన్నారు. రాష్ట్రియ బాల స్వాస్థ కార్యక్రమం ఆర్బీఎస్కేలో కూడా మీ ద్వారానే ఎక్కువ శాతం సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసి ద్వారా తయారు చేసిన జీవన్ ధార అనే ఔషదాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో సోకిన బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టిందని మందులు కూడా లేని సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వేద కళాశాల వైద్య బృందంతో ఎంతో పరిశోధించి బ్లాక్ ఫంగస్‌కు మెడిసిన్ ఆవిష్కరించిందన్నారు.

క్వారెంటైన్ సెంటర్‌గా ఆయుష్‌కు సంబంధించిన 4 ఆసుతప్రులు నేచురోపతి, టిబ్బి బీఆర్కేఆర్, హోమియో ఆసుపత్రులు విశేష సేవలందించాయన్నారు. రెండు దఫాలుగా చేసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో మీరు మంచి సేవలు అందించారని గుర్తు చేశారు. వైద్య రంగంలో ఆగ్ర స్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా ఆగ్ర స్థ్ధానంలో ఉండాలని సిఎం కెసిఆర్ ఆలోచన అని అన్నారు. ప్రకృతి వైద్యం కోసం ఎంతో మంది ప్రైవేట్‌కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని అలాంటి వారికి అతి తక్కువ ఖర్చుకే ఉత్తమ వైద్యం అందించేందుకు మా నేచర్ క్యూర్ ఆసుపత్రిని రూ. 10 కోట్లతో అందంగా , ఆకర్షణీయంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు.

హెల్త్ హబ్ హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారన్నారు. ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేలా ఎదగాలని ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో మీ అందరి భాగస్వామ్యం కావాలన్నారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రిసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయన్నారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్దిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అన్ని జిల్లాలకు విస్తరించే ఆలోచన సిఎం చేస్తున్నారన్నారు. అనంతగిరి హిల్స్‌లో జిందాల్ ఆయుద్వేద ఆసుపత్రిని మించి సెంటర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ ప్రతి రంగంలో హబ్‌గా మారుతుందన్నారు. ఫార్మా రంగంలో , వ్యాక్సిన్ రంగంలో, ఐటీ రంగంలో వైద్యంలో కూడా తెలంగాణ హబ్‌గా మారిందన్నారు. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా హబ్‌గా మారాలని సూచించారు. 9 ఏండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధ్ది చెందిందన్నారు. నీతి ఆయోగ్ ఇండెక్స్‌లో 2014లో తెలంగాణ 11 ఉంటే , ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయుష్ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్. శ్రీరంగపాణి, సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కిషన్ రెడ్డి, డాక్టర్ హరి రమాదేవి, డాక్టర్ ప్రేమానంద్ , డాక్టర్ ఆనసూయ, డాక్టర్ చంద్రశేఖర్ , తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News