Saturday, November 23, 2024

దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

కరకగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరకగూడెం మండలంలో గురువారం విసృ్తతంగా పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో, పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు. రఘునాథపాలెం గ్రామపంచాయతీలో సుమారు రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. సమ్మక్క, సారక్క వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు, తొలుత ఆలయ పూజారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. సిఎం కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లా, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు కరోనా విపత్కర పరిస్థితిలోనూ పారిశుద్ధ విధులు నిర్వహించడం పట్ల వారి సేవలను గుర్తించి శాలువాలతో ఘనంగా సత్కరించి యూనిఫామ్ వారికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్ రైతు వేదికలను ప్రభుత్వ నిర్మించిందన్నారు. అనేక గ్రామాల్లో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని ఆయన అన్నారు. ప్రతి పల్లెకు పక్క రోడ్డు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతుబంధు రైతు బీమా లాంటి చారిత్రక పథకాలను ముఖ్యమంత్రి రూపకల్పన చేశారన్నారు.

పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతులకు నిరంతరం కరెంటు అందించిన ఘనత కెసిఆర్‌దే అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలను మెరుగుపరిచి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీఠ వేస్తుందన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నారని అన్నారు.

అన్ని వర్గాలు సమానంగా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే గ్రామాల అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో గ్రామాల స్వరూపమే మార్చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రేగా కాళిక, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, స్థానిక సర్పంచ్ పోలేపోయిన నరసింహారావు, అంకిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపిడిఒ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News