Monday, November 25, 2024

అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

మరిపెడ: రాష్ట్ర ప్రజల సంక్షేమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, సిఎం కెసిఆర్ దూరదృష్టి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థ్ధానంలో నిలిచిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని తానంచర్ల, వాల్యాతండా, కోట్యాతండా, అజ్మీరతండా, మూలమర్రితండా గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావులతో కలిసి శంకుస్ధాపన, ప్రారంభోత్సవం చేశారు. ముందుగా బంతి పూలు చల్లుతూ కోలాటలు, నృత్యాలతో మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మూలమర్రితండాలో బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్‌నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు.

తానంచర్ల సర్పంచ్ దిగజర్ల శ్వేత ముఖేష్, వాల్యాతండా సర్పంచ్ తేజావత్ జముకి, మూలమర్రితండా సర్పంచ్ తేజావత్ జగని లాలునాయక్, కోట్యాతండా సర్పంచ్ తేజావత్ పూరి, అజ్మీరతండా సర్పంచ్ బానోతు దేవిక శ్రీను, అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుధీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహా నాయకుడు సిఎం కెసిఆర్ అని కొనియాడారు. పల్లెల అభివృద్ధే రాష్ట్ర, దేశాభివృద్ధి అని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పల్లెల, తండాల అభివృద్ధిపై సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు భీమా, నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్, పేదలకు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రజలకు వివరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను నిర్మించి తాగు, సాగు నీరు పుష్కలంగా అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని పేర్కొన్నారు.

ఐదు వందల జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసి మన తండాలో మన రాజ్యం తీసుకువచ్చారని, దీనితోనే ఉమ్మడి తానంచర్ల ఐదు గ్రామ పంచాయితీలుగా ఏర్పడటంతో చాల మందికి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు అయ్యే అవకాశం కలిగిందన్నారు. సిఎం కెసిఆర్‌కు మనం రుణపడి ఉండాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తాయన్నారు. నేను ప్రజా సేవకుడిని, ప్రజలకు అందుబాటులో ఉంటూ శక్తివంచన లేకుండా డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాని తెలిపారు. దీనితో తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

ఎమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఎం కెసిఆర్, తనకు ప్రజలు ఎల్లప్పుడు అండగా ఉంటూ ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ రవిచంద్ర, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబు, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణరెడ్డి, మాజీ జడ్‌పిటిసి బాల్ని మాణిక్యం, ఎంపిటిసి గుగులోతు రమేష్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుగులోతు రాంబాబు నాయక్, తేజావత్ రవీందర్ నాయక్, పాదూరి రాంచంద్రారెడ్డి, రావుల వెంకట్‌రెడ్డి, అయూబ్‌పాషా, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, పంచాయితీరాజ్ ఏఈ శ్రీనివాస్‌నాయక్, ఆర్‌అండ్‌బి ఏఈ శివకుమార్, మిషన్ భగీరథ అధికారులు, శ్రావణ్‌రెడ్డి, తేజావత్ సక్రం, భూక్య రఘు, బాదావత్ తావుర్యా, బానోతు నరహరి, రవి, తేజావత్ శంకర్, తేజావత్ బాలాజీ, బానోతు శ్రీను, నాయకులు, కార్యకర్తలు, తండావాసులు, ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News