Friday, December 20, 2024

అందరి పోరాటంతోనే తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కోసం అం దరూ పోరాటం చేశారని ఏఐసిసి అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చారని, సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు. చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఏఐసిసి అధినేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తాము కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చామని, వాటిని అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాము మాట ఇచ్చామంటే అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో గృహ లక్ష్మీ పథకం కూడా త్వరలో అమలు కాబోతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఏం చేసింది అని బిజెపి అంటోంది, 500 సంస్థానాలు భారత్‌లో కలిపింది కాంగ్రెస్ అని, హైదరాబాద్‌కు స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ అని, దేశంలో అందరిని ఏకతాటిపైకి తెచ్చింది కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు.

ఇస్రో, డిఆర్‌డిఓ, బీహెచ్‌ఈఎల్ సంస్థలను ఎవరు ఏర్పాటు చేశారంటూ బిజెపి నాయకులను మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ అంతా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని, హైదరాబాద్, కోల్‌కత్తా, బెంగళూరు ఎక్కడకు పోయినా కంపెనీలు పెట్టింది కాం గ్రెస్ ప్రభుత్వమన్నారు. దేశంలో పెద్ద ప్రాజెక్టులు కాం గ్రెస్ పార్టీ కట్టిందని, తినడానికి అన్నం, చదవడానికి స్కూల్స్ పెట్టింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. జ మీందారి వ్యవస్థను రద్దు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు. భూ సంస్కరణలు తెచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు.
తొందర పడకండి..అవకాశం వస్తుంది
రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. రాహుల్ గాంధీ ప్రజల కోసం మాట్లాడితే పార్లమెంట్ నుంచి బయటకు పంపారు. భయపడే వాణ్ణి కాదని రాహుల్ గాంధీ నిలబడ్డారు. సీడబ్ల్యూసీలో చేర్పులు ఉంటాయి.. ఇంకా కొన్ని పేర్లు చేర్చుతామని మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజాగర్జన వేదిక మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే సూచన చేశారు. అందరూ కలిసి పని చేయండి, అధికారంలోకి వస్తామని ఆయన సూచించా రు. బిసిలకు ఏం ఇవ్వలేదని వి.హనుమంతరావు పార్టీని అడిగారు. తాను వచ్చిన తరువాత 67 శాతం పదవులు బిసిలకు పెంచానని ఖర్గే చెప్పారు. సీడబ్ల్యూసీలో బిసిల కు ప్రాధాన్యత లేదని విహెచ్ పేర్కొనగా, తొందర పడకండి మీకు కూడా అవకాశం వస్తుందని విహెచ్ మా టలకు ఖర్గే బదులిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సీడబ్ల్యూసీలో ఒక్కరే ఉండేవారు ప్రస్తుతం ఆ సంఖ్యను 6కు పెంచామ ని ఆయన తెలిపారు. పిల్లల మరణాల రేటులో గు జరాత్ రాష్ట్రం ముందు ఉందని ఆయన ఆరోపించారు. రాజ్యాం గం లేకపోతే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని కాలేకపోయే వాడినని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News