Monday, December 23, 2024

విద్యుత్ సమస్యలు లేని రాష్ట్రం తెలంగాణ: సింగిరెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Niranjan reddy serious on congress, bjp leaders

వనపర్తి: విద్యుత్ సమస్యలు లేని తెలంగాణగా తయారు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పుడు కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డామని, కానీ ఇప్పుడు మిగులు కరెంటు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగామని ప్రశంసించారు. గత మూడేళ్ల నుంచి ఉచిత విద్యుత్‌తో పాటు విద్యుత్ సమస్యలు లేని తెలంగాణ తయారు చేశామని పొగిడారు. రైతులు అడిగిన వెంటనే విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. రూ.50 వేల కోట్లతో రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News