Wednesday, November 13, 2024

కీలకదశకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

Telangana issued guidelines on transfers of Employees

కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా
జిల్లా కలెక్టర్, శాఖాధిపతితో కమిటీ
విధుల్లో చేరేందుకు మూడురోజుల సమయం
వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త జోనల్ విధానంలో భాగంగా చేపట్టిన ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల పోస్టింగుల కోసం అధికారులు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త స్థానికత అనుగుణంగా మరో జిల్లాకు కేటాయింపులు చేసిన వారి కోసం బదిలీలు చేపట్టి పోస్టింగులు ఇవ్వనున్నారు. పనిచేస్తున్న జిల్లాలకే కేటాయింపులు అయిన వారు మాత్రం ప్రస్తుత పోస్టింగుల్లోనే కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర జిల్లాలకు కేటాయింపు అయిన వారికి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి కొత్త పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందించి ఉద్యోగుల నుంచి ఐచ్చికాలను తీసుకోనున్నారు. సీనియారిటీ, ప్రత్యేక కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని కొత్త పోస్టింగులు ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్, జిల్లా శాఖాధిపతితో కమిటీ ఏర్పాటు చేశారు.

విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు మూడురోజుల సమయం

వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీలు, పోస్టింగుల తర్వాత విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు మూడు రోజుల సమయం ఇచ్చారు. శాఖల అవసరాన్ని బట్టి పోలీసు, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖలు అవసరమైతే విడిగా మార్గదర్శకాలు జారీ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అవసరమైతే జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విడిగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖల కార్యదర్శులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని, రోజువారీ పురోగతిని సాధారణ పరిపాలన శాఖకు నివేదించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విడిగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News