హైదరాబాద్: నూతన జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో అన్ని ప్రాంతాలకి ఉద్యోగం, విద్యలో సమాన వాటా దక్కుతుందన్నారు. ఉమ్మడి ఎపిలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశామన్నారు. తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, జోన్ల వర్గీకరణ చేపట్టామన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కెటిఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే లభిస్తాయని మంత్రి తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేటు సంస్థలకు ప్రత్యేక రాయితీలు అందుతాయన్న కెటిఆర్ ప్రైవేటు సంస్థలకు రాయితీలపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
Telangana issues new zonal system orders