Thursday, January 23, 2025

రాహుల్‌గాంధీతో తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం భేటీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌తో పనిచేయాలని రాహుల్ సూచన
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: కోదండరాం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టిజేఎస్ (తెలంగాణ జన సమితి) చీఫ్ కోదండరాం శుక్రవారం కరీంనగర్ విపార్క్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరాంకు రాహుల్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా కోదండరాం పోటీకి ఆసక్తి చూపలేదని తెలిసింది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ కోసం రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కలవాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని టిజేఎస్ నిర్ణయించిందన్నారు. ఇక, పొత్తులో భాగంగా కాంగ్రెస్ వీక్‌గా ఉన్న అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోదండరాం రాహుల్‌ను కోరినట్లు తెలిసింది. రాహుల్ తో జరిగిన భేటీలో పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్, కోరుట్ల, ఎల్లారెడ్డి, ముథోల్ టికెట్లను టిజేఎస్ ఆశిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News