Monday, January 20, 2025

తెలంగాణ జనసమితి ఏ పార్టీలో విలీనం కాదు : కోదండరాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలూ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ పార్టీల్లోని నాయకుల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చొరవ మొదలైంది. బిఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా నివారించే విపక్షపార్టీలు ఒక్కటవుతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే టిజెఎస్‌ని ఇతర పార్టీలో విలీనమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కోదండరాం స్పందించారు.

తెలంగాణ జన సమితి(టిజెఎస్)ని వేరే ఇతర పార్టీల్లో విలీనం చేయబోతున్నామని వస్తున్న వార్తలు సత్యదూరమని., వాస్తవం కాదని స్పష్టం చేశారు. తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం. ఇతర పార్టీలతో కలిసి పనిచేయాలనే ఆలోచన మాత్రమే తమకు ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేస్తామన్నారు. మరోవైపు ఈ ప్రయాణం ఎన్నికల సమయానికి ఏ రూపం తీసుకుంటుందో ఇప్పటికైతే ఆలోచించలేదని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వాటిపై స్పందిస్తానని తెలియజేశారు. మరోసారి టిజెఎస్ ఏ పార్టీలో విలీనం కాదని పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News