Saturday, January 11, 2025

ఆర్మీ బస్సు ప్రమాదం: తెలంగాణ జవాను మృతి… తిర్మాన్ దేవునిపల్లిలో విషాదఛాయలు

- Advertisement -
- Advertisement -

లడఖ్‌లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పైనుంచి జారి లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీలోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన ఆర్మీ జవాన్ చంద్ర శేఖర్(30) కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిర్మాన్ దేవునిపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్ర శేఖర్ ముదిరాజ్ తన చదువు ఒకటవ తరగతి నుండి 3 వరకు తిర్మాన్ దేవునిపల్లి గ్రామంలో, 4వ తరగతి నుండి 7 వరకు తంగెళ్లపల్లి గ్రామంలో తర్వాత కొందుర్గ్ బీసీ హాస్టల్ లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి దేశ రక్షణ సేవలో పనిచేయాలని కోరిక ఉన్న శేఖర్ 10వ తరగతి అవ్వగానే దేశ సేవకోసం అర్మిలో జాయిన్ అయ్యాడు.

చంద్ర శేఖర్ తల్లిని, భార్య, పిల్లలను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని గ్రామము మొత్తం మీ వెంట ఉంటుందని బారోసా ఇచ్చారు. వీరుడా తంగెళ్లపల్లి నీకు సెల్యూట్ చేస్తుంది.. నీ స్పూర్తితో ముందుకు పోతాం.. శేఖర్ మరణం తీరని లోటని వారు తెలియజూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News