Thursday, January 23, 2025

త్వరలోనే జాబ్ క్యాలెండర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎం ఎల్‌ఎ హరీశ్‌రావు చంద్రబాబును ఉదాహరణ గా తీసుకోవడం చూస్తే ఆయన పరిస్థితి ఏమి టో అర్థమవుతుందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తాము తెలంగాణ ప్రజలు ఆలోచనలను అమలు చేస్తాం కానీ, ఎపి ఆలోచనలు కా దన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. పింఛన్ల పెంపులో సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను మేమే నిర్వహించామని మంత్రి చెప్పారు. త్వరలోనే జాబ్ క్యా లెండర్‌ను విడుదల చేస్తామని ఆయన చె ప్పా రు.

ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హ రీష్‌కు లేదన్నారు. వాళ్ల హయాంలోనే ఆశా వ ర్క ర్స్‌ను గుర్రాలతో తొక్కించారని శ్రీధర్‌బాబు విమర్శించారు. త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, మొన్ననే ముగసిందని, కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి ఘటనపై విచారణ జరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. శాంతి భద్రత విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఆయన తేల్చిచెప్పారు. మతఘర్షణల విషయంలో సీరియగా ఉన్నామని మెదక్ అల్లర్ల ఘటన వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదంతో అణచివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News