Monday, December 23, 2024

100 days @ కంటి వెలుగు.. కేక్ కట్ చేసిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి, దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయింది. ఈ సంధర్బంగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ కలిసి డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేక్ కట్ చేసి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్యదర్శి రిజ్వి, కార్యదర్శి శ్వేతా మహంతి, డైరెక్టర్ మెడికల్ & హెల్త్ శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: కేంద్ర బలగాలపై సుప్రీంకోర్టుకు బెంగాల్ ఎన్నికల కమిషన్

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. లక్ష్యానికి మించి కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేశామన్నారు. అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కంటివెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మందికి కంటిచూపు వచ్చిందన్నారు. గ్రామాలకే వచ్చి కంటి పరీక్షలు చేయడం రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News