ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్
కోహెడ: తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వైద్యరంగంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, “కంటి వెలుగు” పథకంతో మరోసారి దేశానికి తలమానికం అయ్యిందని కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో సోమవారం రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్, జడ్పిటిసి నాగరాజు శ్యామలమధుసూదన్‌రావులు ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సంక్షేమమే లక్షంగా సీఎం కెసిఆర్ నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకొని పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
అంధత్వాన్ని దూరం చేయడమే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రజలందరూ కంటి వెలుగు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి అద్దాలను ఎంపిపి కీర్తిసురేష్, జడ్పిటిసి శ్యామలమధుసూదన్‌రావులు అందజేవారు. ఎంపిడివో మధుసూదన్, ఎంపివో సురేష్, సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి నిహారిక, ఎపిఎం తిరుపతి, సిసి జాగిరి కుమారస్వామి, వార్డు సభ్యులు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గోన్నారు.