Saturday, December 21, 2024

దేశానికే ఆదర్శం ‘కంటి వెలుగు’

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

18 సంవత్సరాలు పై బడిన కంటి చూపు సమస్య ఉన్నవారు ప్రభుత్వం నిర్వహించిన వైద్య శిభిరాల్లో ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ జ్యోతి కృష్ణ, బల్వంతపూర్ సర్పంచ్ తౌడ బాలలక్ష్మి, ఎంపీటీసీ కోమటిరెడ్డి రాధా, మనోహర్‌రెడ్డి, దుబ్బాక మండల ఎంపీడీఓ శర్మ, డాక్టర్ బార్గవి, గ్రామ వార్డు మెంబర్లు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

18వ వార్డులో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గన్నెవనిత అన్నారు. గురువారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అదేశాల మేరకు మున్సిపల్ 18వ వార్డులో గల శివాలయం పక్కన నీలకంఠ భజనమండలిలో మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది. బిఆర్‌ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News