Monday, December 23, 2024

కంటి వెలుగును సక్సెస్ చేయాలి

- Advertisement -
- Advertisement -

ఎంపీపీ శ్యామాలమ్మ, జడ్పీటీసీ వెంటకయ్య

మాగనూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేయాలని జడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామాలమ్మ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యలయంలో వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ… రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభం కానుందని, ప్రజలకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్ధాలు అందజేయన్నుట్లు తెలిపారు.

సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని, గ్రామాల్లో క్యాంపులు నిర్వహించడానికి భవనాలు సిద్ధంగా ఉంచేందుకు పంచాయతీకార్యదర్శులు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ తిప్పయ్య, ఆయా గ్రామాల సర్పంచులు రాజు, జయప్రద, తిమ్మప్ప, ఎంపీటీసీలు ఎల్లారెడ్డి, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీవో జైపాల్‌రెడ్డి,వైధ్యాసిబ్బంది, ఆయా గ్రామాల పంచాయతీకార్యదర్శులు, ఏవో హరిత ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News