Wednesday, January 22, 2025

కంటి వెలుగు పథకం దేశంలోనే లేదు

- Advertisement -
- Advertisement -

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు పథకం చీకట్లను దూరం చేస్తుందన్నారు. కంటి వెలుగు పథకం దేశంలోనే ఎక్కడ లేదని సభాపతి పేర్కొన్నారు. ప్రజలతో పాటు ఆయన కూడా కంటి పరీక్షలు చేసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది, కంటి వెలుగు కార్యక్రమంపై ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశించారు. స్పీకర్ వెంట రాష్ట్ర వక్ప్ బోర్డు చైర్మన్ మసిఉల్ల, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News