Wednesday, January 22, 2025

కంటి వెలుగును ప్రజలు ఆదరిస్తున్నారు…

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి కొనసాగిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఎంపిపి గైని అనసూయ రమేష్ అన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిభిరాన్ని ఎంపిపి అనసూయ, జడ్పిటిసీ కమ్లి నర్సింలు, జడ్పి కోఆప్షన్ సభ్యుడు మోయినొద్దిన్, తహశీల్దార్ కే.ధన్వాల్, మండల వైద్యాధికారి ఆస్మా అఫ్షీన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కంటి వెలుగును గ్రామప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిటిసీ పాపనోల్ల బీరయ్య స్క్రీనింగ్ చేయించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ వంకాయల రవి, సింగిల్విండో చైర్మన్ కమలాకర్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ వడ్ల రాజెందర్, వార్డు సభ్యుడు సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు గాదారి అశోక్ రెడ్డి, గంగరాజమ్, రైతు బందు గ్రామ అద్యక్షుడు జోగిని పెద్ద నర్సయ్య, పిహెచ్‌సీ సూపర్‌వైజర్ శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఎం ప్రేందాస్, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News