Wednesday, January 22, 2025

అక్షరాన్ని మండించిన కవి

- Advertisement -
- Advertisement -

నేను అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని అంటూ పల్లె మొగదాట్లో ధిక్కారాన్ని నిలబెట్టిన ధిక్కార పతాకం ‘కలేకూరి ప్రసాద్’ దళిత తల్లుల కడుపు కోతల, కన్నీటి ఆవేదనలు చూసి ‘కులం’ కుతికలపై కాలువేసి చిర్రచిటికేన పుల్లతో డప్పులు దరువేసి, కులమతోన్మాద రాజ్యాన్ని ధిక్కరించిన ధిక్కార స్వరం ‘కలేకూరి ప్రసాద్’ చరిత్రపుటల్లో, మీ గుండెల్లో నా పేరు చేర్చుకోండి పెనుమంటల పెనుగులాటలై, ధిక్కారస్వరాలై పిడికిళ్లు బిగించి బడుగుబతుకుల గుడిసెల్లో మీరు వెలుగునిస్తారు తూర్పున సూర్యుడై ప్రభవిస్తారు అంటాడు ‘కలేకూరి ప్రసాద్’ మనం చేయాల్సింది రాయడమే బాగా రాయడం వాళ్ళ ప్రమాణాల్లో, వాళ్ల ఆమోదం కోసం కాదు, ఎవరి ఆవార్డులకోసం కాదు ఎవరి సత్కరాలకోసం కాదు మనం రాయాలి …
కూలిబతుకల్లో పొద్దుపొడిసేలా పల్లెపల్లెనా దళితకోయిల పాడేలా జాతరజాతరగా దళిత సమూహాలు గడ్డగుండెలమీద ఊరేగింపై నడిచిపోతున్నట్లుగా రాయాలి ఏదిరాసిన మన ప్రమాణంలో రాయాలి. మూడు వేల సంవత్సరాల అణిచివేతను, అవమానాలను, హింసను భరిస్తూ వున్న జాతి.. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బతికే పాఠాలు నేర్పాలి అన్ని చేప్పిన మహాకవి ‘కలేకూరి ప్రసాద్’ జీవితం మొత్తం బహుజనుల బతుకల వెలుగుల రాజ్యాధికారం, బతికాడు, నిరంతరం బహుజనుల కోసమేరాసాడు, కవితైనా, పాటైనా, వ్యాసంమైనా, అనువాదమైనా, విమర్శయినా తన శైలిలో పాఠకుల బుర్రల్లో ఆలోచనల సేగలపుట్టిస్తు, కన్నీటి చుక్కల్లో నుండి చురకత్తుల వీరులుకావాలనీ దళితతల్లుల గుండకోతల మంటలమండే ఆవేదనలె రాసాడు పోరులో, హోరులో, బరిలో చేలరేగిపోయాడు. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటూ దళిత మ్యానిఫెస్టో కవిత రాసీ దేశదళితుల గాయాలచరిత్రను ,ధిక్కార తిరుగుబాటు కవిత్వంలో రికార్డ్ చేసాడు’ నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ/ వేల ఏళ్ళక్రితం ఈ గడ్డమీదనే చంపబడ్డాను………. /ఇరవై రెండేళ్ళ క్రితం నాపేరు కంచికచర్ల కోటేశు/ నా జన్మస్థలం కీలవేన్మణి, కారంచేడు, నీరుకొండ/ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్య క్రౌర్యం………. నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి/ ఎగిరే ధిక్కార పతాకాన్ని / నాకోసం కన్నీరు కార్చకండి/ మీకు చేతనైతే / నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి / జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను/………… ఒక పెనుమంటల పెనుగులాటనై/మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను అంటూ దళితుల చరిత్రమొత్తం ఈ కవితలో పొందుపర్చారు కలేకూరి,… కంచికచర్ల కోటేశు ఘటన, కీలవేన్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు దళితులపై దాడులను మొత్తం ఈ కవితలో రాసారు ఈ కవిత చదివితే ఈ దేశ దళితుల చరిత్ర తేలిసేలా కలేకూరి అక్షరాలు తూటలను పేల్చాడు, ఇక కలేకూరి పేరు కన్నా పాట చెబితేనే ఈ పాట యితను రాసింది అనేవాళ్లు ఇప్పటికి చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి పాటలు రాసేవాళ్లు సినిమా రంగంలో లేరు, ఈపాట దేశంమొత్తం మార్మోగింది, ఈపాట తెలియనివారు వుండారు ఈపాట నేను ఎక్కువగా పాడాను అని స్వయంగా ప్రజాయుద్ధ నౌక, గాయకుడు గద్దరే ఒక దాంట్లో చెప్పారు అదే పాట ఈ పాట’ కర్మభూమిలో పూసిన ఓపూవ్వా / విరిసీ విరియని ఓ చిరునావ్వా/కన్నుల ఆశల నీరై కారగ/కట్నపు జ్వాలలో సమిధై పోయావా…/ పాట తెలియని వారు ఉండరు కలేకూరి మాత్రమే ఇట్లాంటి పాటలు రాస్తారు అని ఇట్లాంటి మొత్తం 50 వరకు రాసాడు అనీ దళిత కవి, రచయిత నాగప్పగారి సుందరాజు ఒక ఇంటర్వ్యూలో చేప్పారు తనకు ఇష్టమైన కవులలో, రచయితలలో ‘కలేకూరి ప్రసాద్’ అంటే ఇష్టమని పేర్కొన్నారు, చాలా మంది కవులపై, రచయితలపై, కలేకూరి ప్రసాద్’( యువక) ప్రభావం వుందని కొన్ని ఇంటర్వ్యూల్లో మనం చూశాం, మరల’ భూమికి పచ్చని రంగేసినట్టో /పంట చేలు పెరగాలి ఓ యమ్మలాలో /ఆలి పుస్తెలమ్ముకొని అప్పు దీర్చుకొంటివో../వలవలవల ఏడ్చుకొంటు వలసెల్లి పోతివో/పురుగుల మందే నీకు పెరుగన్నమాయరో/………../ చెమట జల్లు చిలకరిస్తేనేల పులకరించెరో/….. ఎగువ పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే /తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే /…… నేలతల్లి నీళ్ళాడి పసిడి పంటలిచ్చునో/నా సీమ కన్నుల్లో వెలుగులు నిండేనురో అంటూ ఈ పాట కూడా ఒక వూపు వూపింది. ‘కలేకూరి’ కలంలో సీమ ఔన్నత్యంతో ఈపాట తొణికిసలాడుతూ భూమికి పచ్చని పంటలే మనకు కావాలి అని శ్రమవీరుల రైతుల కండ్లలో వెలుగునిండాలని కూలిబతుకులో పొద్దుపొడవాలని ఈ పాటలో కలేకూరి ప్రసాద్ చెబుతారు. ముసుగుతోడుక్కుని ‘కలేకూరి ప్రసాద్’ పేరు చేప్పనివాళ్లు వున్నారు, ఉన్నది ఉన్నట్లు మాట్లడే మనిషి’ అందుకే అతని సూటిదనం చాలమందికి ఇష్టం ‘కలేకూరి ప్రసాద్’ 5 వ సంత్సరం అప్పుడు ‘కంచికచర్ల కోటేశు ఘటన (ఆరుకుట్ల కోటేశు )1969, ఫిబ్రవరిలో 18 లో జరిగితే , కోటేశు ఘటన కలేకూరిని ఆలోచించేలా, రాయించేలా, తిరగబడేలా, ఉద్యమ కారుడిగా చేసింది. ఆ కోటేశు ఘటనకు కలేకూరి ప్రసాద్ ఒక అద్బుతమైన దళిత ప్రేమ కవిత రాసి సంచలనం సృష్టించాడు. ఆ కవితే ‘అంటరాని ప్రేమ’ గాయాలు సలుపుతున్నా/ గుండెలమీద నీ పాదముద్రల్నే కదా మోశాను /చావు ముంచుకొస్తున్నా/నీతో బతుకునే కదా కోరుకున్నాను/……/ చచ్చిన శవాలను తగలబెట్టడం తెలుసు నాకు/ కానీ బతికుండగానే /మీ వాళ్లు నాకు నిప్పు పెట్టారు/…….. / ప్రియా /ఈ మంటలు నన్ను అలుముకుంటుంటే/ నువ్వు నన్ను వాటేసుకున్నట్టే వుంది…. అంటూ కంచికచర్ల కోటేశు ఘటనకు అంకితం ఇస్తూ ఒక దళితప్రేమ హృదయంలో నుండి వచ్చే కవిత రాసారు కలేకూరి, కలేకూరి ప్రసాద్ ‘దళిత సాహిత్యం విమర్శ గ్రంథం’ మొట్టమొదటిసారిగా కలేకూరి ప్రసాద్ మాత్రమే రాసాడు అని చాలామంది చేప్తువుంటారు.
ఇక అనువాదలు 70 చేసాడని అందులోస్వామి ధర్మ తీర్థ 1: హిందూ సామ్రాజ్యవాదం, 2: అరుంధతీరాయ్ ఊహలు సైతం అంతమయ్యేవేళ, 3: కిశోర్ కుమార్ కాళే ఆత్మకథ ‘ఎదురీత’ 4: ప్రిమొలెవి రాసిన ఖైదీ నెంబర్ 174517, చేగువేరా, మహాశ్వేతాదేవి, బషీర్ కథలు, కృష్ణ కుమార్, పాశ్చాత్య రచయితల పుస్తకాలు, పాబ్లోనెరుడా కవితలు ఇంకా చాల అనువాదలు చేశాడు, కలేకూరి ప్రసాద్ రెండు రాష్ట్రాలు కలసి వున్నప్పుడు ‘ఆంధ్రప్రదేశ్ దళితుల చరిత్ర’ అంటూ ఒక పుస్తకం రాశాడు. మొత్తం రాష్ట్రంలో దళితులపై దాడులెన్నో జరుగుతున్నాయని వాటిని లెక్కలతో సహా దళితులపై దాడులను రికార్డు చేస్తూ ప్రభుత్వాలు దళితులపై దాడులు జరిగితే ఏలా స్పందిస్తాయీ అని ఆ సెక్షన్లు పెట్టేటప్పుడు ఎలా పెడ్తారని సూక్ష్మంగా పరిశీలించి రాశారు కలేకూరి. ఏంతో పోరాట ఫలితంగా S.C/S.T అట్రాసిటీ చట్టం తెచ్చుకుంటే దానిని కూడా కేసులప్పుడు ఎలా ఈ అగ్రకులవాదులు మార్చడానికి ప్రయత్నం చేస్తారో వివరించారు కలేకూరి ప్రసాద్ …ఎక్కడ దళితులపై దాడి సంఘటన జరిగినా తక్షణం స్పందించి పాల్గొంటూ, కవితలు, పాటలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో ఆ ఉద్యమపోరాటంలో పాల్గొనేవాడు. ‘కలేకూరి ప్రసాద్’ బహుజనుల రాజ్యాధికారం కోసం ఏన్నో కవితలు, పాటలు, వ్యాసాలు రాశారు అదే క్రమంలో మాన్యవర్ కాన్షీరాం పెట్టిన బహుజన్ సమాజ్ పార్టీ తరుపున 1994లో నందిగామ నియోజకవర్గ బియస్‌పి అభ్యర్ధిగా పోటిచేశారు, అటు కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సమాజంకోసం రచనలు చేస్తూనే ఇటు రాజ్యాధికారం కోసం పార్టీలో పనిచేశారు కలేకూరి ప్రసాద్ ….ఇప్పుడు ఒక కవిత రాసో, అనువాదం చేసే చంకలు గుద్దుకుంటూ పెద్దఫోజు ఇచ్చే రచయితలు’ కలేకూరి ప్రసాద్ జీవితం నుండి ఉద్యమం నుండి రచనల నుండీ ఎంతో నేర్చుకోవాల్సింది వుంది.. మీటింగ్ అంటే టిప్పుటాప్పుగా బయలుదేరి వచ్చి అంబేద్కరిజం సబ్జెక్టు తెలియకుండా మైకులు మింగే ఊకదంపుడు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ‘కలేకూరి ప్రసాద్’ చాలా సింపుల్ గా ‘హావ్వయి చేప్పులు, రబ్బరు చెప్పులతో, మసిపట్టిన బట్టలతో (అప్పుడప్పుడు)’ చేతులో డబ్బులు లేకుండానే మీటింగ్‌లకు పోయి విలువైన ఆంశాలు చాలా చేప్తారని అతనితో ఉద్యమంలో, పాల్గొన్న మిత్రులు చేప్తున్నారు. ‘కలేకూరి ప్రసాద్’ చివరి రోజుల్లో కంచికచర్లలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ రోడు ప్రక్కన ఒకగానుగు చెట్టుకింద నాపరాయి మీద పడుకున్నాడు, అక్కడే అతని మిత్రులతో కలిసి ఎన్నో సాహిత్య, రాజకీయ అంశాల గురించి చర్చించేవాడు, ఏదైనా ‘కలేకూరి సంచలనమే, కలేకూరే సంచలనం’

తంగిరాల సోని
9676609234

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News